Mahaa Daily Exclusive

  జీళ్ళచెరువులో నాలుగు కుటుంబాలకు ఆత్మీయ భరోసా అందజేత..!

Share

కూసుమంచి, సెప్టెంబర్ 14, మహా:

కూసుమంచి మండలంలోని జీళ్ళచెరువు, గోపాలరావుపేట road గ్రామాల్లో అనారోగ్య కారణాలతో మరణించిన కుటుంబాలకు పొంగులేటి శ్రీనన్న ఆత్మీయ భరోసా కింద రూ.10వేల చొప్పున రూ. 40వేలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం అందజేశారు. ముందుగా చనిపోయిన వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భరోసా డబ్బులను అందించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటూరి పుల్లయ్య, కాసాని వెంకన్న, లక్ష్మయ్య, ఉపేందర్, నాగేశ్వరరావు, వెంకన్న‌‌ తదితరులు పాల్గొన్నారు..

జుజ్జులరావుపేటలో..
కూసుమంచి మండలం జుజ్జులరావుపేట గ్రామంలో ఇటీవలే మృతి చెందిన కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శీనన్న ఆత్మీయ భరోసా డబ్బులను పంపిణి చేశారు. కుటుంబానికి రూ10వేలను అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఈ సహాయం మానవతా మన్ననుకు మారుపేరుగా నిలుస్తుంది అని వారు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు మంత్రి పొంగులేటి శ్రీనన్న సేవను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కంచర్ల జీవన్ రెడ్డి, ఇంటూరి పుల్లయ్య, చెన్నా మోహన్, శేఖర్ రెడ్డి, జిల్లపల్లి ఉప్పయ్య తదితరులు పాల్గొన్నారు.

Latest