వైసీపీపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. వైసీపీ హయాంలో అమలాపురంలో కులాల మధ్య చిచ్చు పెట్టారు. ఇప్పుడు కూడా వైసీపీ నేతలు అదే పని చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి నీచ రాజకీయాలు చూడలేదు. రాష్ట్రంలో ప్రతిచోటా అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని మండిపడ్డారు
Post Views: 43






