ఇంజనీర్లు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఇంజనీర్స్ డే సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ డే జరుపుకుంటామని వెల్లడించారు. మూసీ వరదల నుంచి హైదరాబాద్‌ను రక్షించేందుకు ప్రణాళికలు రూపొందించారని గుర్తు చేశారు. తమ మేధోశక్తితో మానవ మనుగడకు ఎన్నో ఫలాలను అందించిన ఘనత ఇంజనీర్లకే దక్కుతుందని తెలిపారు.
Post Views: 79






