TG: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ ఏది చెప్తే రేవంత్ రెడ్డి అది చేస్తున్నాడని, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రా? బీజేపీ పార్టీ ముఖ్యమంత్రా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయంటూ ఆరోపించారు. తమ హయాంలో గ్రూప్ 1 పరీక్షలు అయినప్పుడు హంగామా చేసిన బండి సంజయ్ ఇప్పుడెందుకు నోరు మూసుకొని ఉన్నాడు? అంటూ ప్రశ్నించాడు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ గ్రూప్ 1 మీద రేవంత్ రెడ్డిని ఒక్క మాట కూడా అనడం లేదంటూ మాట్లాడారు.
Post Views: 22






