ఆదిలాబాద్ మహా: తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ బుధవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా తో కలిసి సమావేశం నిర్వహించారు .ఆదిలాబాద్ జిల్లా క్రైస్తవ సంఘం అధికారులు పాస్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా, పాస్టర్లు క్రైస్తవ స్మశానవాటికకు భూమి, బీసీ-సీ కుల ధృవీకరణ పత్రం క్రైస్తవ కమ్యూనిటీ హాల్ వంటి వారి సమస్యలను ఆయనకు వివరించారు. చైర్మన్ జిల్లా కలెక్టర్ లు వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్యామల దేవి, మైనారిటీ సంక్షేమ అధికారి షేక్ కలీం అహ్మద్ , ఫాస్టర్లు, తదితరులు ఉన్నారు.
Post Views: 28






