Mahaa Daily Exclusive

  విశ్వ‌క‌ర్మ‌లు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలి- కంది శ్రీ‌నివాస రెడ్డి ..!

Share

ఆదిలాబాద్ మ‌హా : విశ్వ‌క‌ర్మ‌లు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాల‌ని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి ఆకాంక్షించారు. బుధవారం విశ్వ‌క‌ర్మ జ‌యంతిని ప‌ర‌స్క‌రించుకొని ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలోని పోతులూరి వీర‌బ్ర‌హ్మేంద్ర‌స్వామి ఆల‌యంలో జ‌రిగిన కార్యక్ర‌మానికి ఆయ‌న ముఖ్యఅతిగా హాజ‌ర‌య్యారు. విశ్వ‌క‌ర్మ కుల‌స్తులు ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికి శాలువాతో స‌త్క‌రించారు. ఆల‌యంలో ఆయ‌న ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. కుల‌వృత్తులు అంత‌రించిపోయి విశ్వ‌క‌ర్మ‌లు వివిధ ప్రైవేట్ ఉద్యోగాల్లో ప‌ని చేసుకుంటూ క‌ష్ట‌ప‌డుతున్నార‌న్నారు.ఒక‌ప్పుడు గ్రామీణ ప్రాంతాల‌లో విశ్వ‌క‌ర్మ‌ల పాత్ర చాలా ముఖ్య‌మ‌ని అన్నారు.వ‌డ్ల ప‌నిముట్లు , క‌మ్మ‌రికొలిమిలు ,కంసాలి ప‌నులు మూత ప‌డ్డాయ‌న్నారు. విశ్వ‌కర్మ‌లు ఎదుర్కుంటున్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం తాను కృషి చేస్తాన‌న్నారు. సంఘ భ‌వ‌నానికి ఎస్డీఎఫ్ నిధుల నుండి 5ల‌క్ష‌లు మంజూరు చేయిస్తాన‌ని హామీ ఇచ్చారు.అనంత‌రం విశ్వ‌బ్రాహ్మ‌ణ చైత‌న్య‌యాత్ర ఆధ్వ‌ర్యంలో పుష్ప‌గిరికి 1500 కిలోమీట‌ర్ల పాద‌యాత్ర‌ను ఆయ‌న ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో గిమ్మ సంతోష్ రావు, బండారి సతీష్, కలాల శ్రీనివాస్, దేవిదాస్ చారి,కొండా గంగాధర్, బీసీ సంఘం జిల్లా అధ్య‌క్షులు చిక్కాల ద‌త్తు ,మానె శంక‌ర్ , విశ్వ‌క‌ర్మ సంఘం జిల్లా అధ్యక్షులు సామన్ పెళ్ళి న‌ర్సింలు, ప్రధాన కార్యదర్శి మీసాల స్వామి, కోశాధికారి కొత్త పల్లి దశరథ్, పోలాజి హనుమండ్లు ,అంగాజి వెంకటస్వామి, ఉదారి శ్రీ‌నివాస్ ,గొల్ల పెల్లి నర్సింలు, ప‌డ‌కంటి క్రిష్టయ్య ,వెల‌చ‌ల్ మాణిక్ రావు, బొల్లాజి లెనిన్ , ముమ్మ‌డి అశోక్ త‌దిత‌రులు పాల్గొన్నారు

Latest