ఆదిలాబాద్ మహా : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలతో ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తుందని అదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజాసేవాభవన్ ఆవరణలో జరిగిన ప్రజా పాలన దినోత్సవ సంబరాలలో భాగంగా పెద్ద ఎత్తున హాజరైన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మంచి సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరుతున్నాయని ప్రజలందరూ ప్రజా పాలనను ఆశీర్వదిస్తున్నారని ఆయన అన్నారు . ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలు ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, పేదలకు ఉచిత సన్నబియ్యం, రైతు భరోసా, రుణమాఫీ లాంటివి ప్రభుత్వ ప్రజా పాలనకు అద్దం పడతాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సాహసోపేత నిర్ణయం వల్లనే మనం ఈనాడు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాలు జరుపుకుంటున్నామన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి నష్టమని తెలిసిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ఆమోదం తెలిపిన త్యాగశీలి తెలంగాణ తల్లి సోనియా గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆకాంక్షలు ఆశయాలకు అనుగుణంగా కలిసి ముందుకు సాగుదామని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గిమ్మ సంతోష్ రావు,కొండ గంగాధర్,సిడ్మకే ఆనందరావు,గుడిపల్లి నగేష్,మునిగెల నర్సింగ్, బండారి సతీష్, రామ్ కుమార్, జాఫర్ అహ్మద్,ఇమ్రాన్ ,లోక ప్రవీణ్ రెడ్డి, బండి దేవి దాస్ చారి, సుధాకర్ గౌడ్,బోనగిరి సంటెన్న, రఫిక్, పత్తి ముజ్జు, అంజద్, అయాజ్, తౌఫిక్, దొగ్గలి రాజేశ్వర్,నిమ్మల ప్రభాకర్,బూర్ల శంకరయ్య, మంచాల మల్లయ్య,రావుల సోమన్న యాదవ్, ఆశన్న, శ్రవణ్ నాయక్, మోర ఆశన్న,అజయ్,శ్రీలేఖ, లత, సోనియా మంథని, ఇందిరా, తదితరులు పాల్గొన్నారు.






