Mahaa Daily Exclusive

  యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు సమ్మెకు దూరంగా ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్..!

Share

హైదరాబాద్, మహా: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లుగా తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (టీఏఎన్‌హెచ్ఏ) ప్రకటించినా వైద్య సేవలపై ఆ ప్రభావం పడలేదు. రాష్ట్రంలో చాలా నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగాయి. ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్ చాలా మటుకు సమ్మెకు దూరంగా ఉన్నాయి. బుధవారం ఆరోగ్యశ్రీ పేషెంట్లకు వైద్య సేవలు అందించిన హాస్పిటల్స్ 87 శాతంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో కేవలం 13 శాతం హాస్పిటళ్లలోనే వైద్య సేవలు ఆగినట్లు సమాచారం. అయినప్పటికీ వైద్య సేవలు కొనసాగించాలని ఆయా హాస్పిటళ్లకు ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ మరోసారి విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యశ్రీ కింద గత రెండు వారాలుగా సగటున రోజూ 844 సర్జరీలు నమోదవగా… ఒక్క బుధవారం నాడే 799 సర్జరీలు నమోదు అయ్యాయని ఆరోగ్యశ్రీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు టీ.ఏ.ఎన్.హెచ్.ఏ వైద్య సేవలకు దూరంగా ఉంటామని ప్రకటించిన తరుణంలో రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ దవాఖాన్లలో మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 477 ప్రైవేటు హాస్పిటల్స్ ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తుండగా… కేవలం 62 హాస్పిటల్స్ మాత్రమే సేవలు బంద్ చేశాయని 415 హాస్పిటల్స్ లో సేవలు యధావిధిగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు.

Latest