Mahaa Daily Exclusive

  ఏఎన్ ఎన్ క‌థ‌నానికి స్పంద‌న ప‌శువైద్య శిబిరం నిర్వ‌హ‌ణ‌..!

Share

ఆదిలాబాద్ మ‌హా : ఏఎన్ ఎన్ క‌థ‌నానికి స్పంద‌న ల‌భించింది. బేల మండలంలో పలు గ్రామాల్లో గత రెండు రోజుల నుండి లంపి స్కిన్ వ్యాధి రోజు రోజుకు వ్యాప్తి చెందుతుందని ఏఎన్ఎన్ వరుస కథనాలు ప్ర‌సారం చేసింది. దీంతో పశువైద్య అధికారులు స్పందించి గురువారం మండలంలోని సిర్సన్న గ్రామంలో ఉచిత ప‌శు వైద్య‌ శిబిరాన్ని ప్రారంభించారు. మండలంలోని పలు గ్రామాల్లో పశువులకు లంపి చర్మ వ్యాధి రోజు రోజుకు విజృంభిస్తున విష‌యం తన దృష్టికి వచ్చిందని మండల పశువైద్య అధికారి శ్రవణ్ కుమార్ అన్నారు.దీంతో వెంట‌నే సిర్సన్న గ్రామంలో వ్యాధిసోకిన ప‌శువుల‌కు టీకాలు వేయ‌డం ప్రారంభించిన‌ట్టు చెప్పారు.మిగితా గ్రామాల్లో కూడా వారం రోజుల్లో వ్యాక్సిన్ పూర్తి చేస్తామని తెలిపారు. త‌మ సమ‌స్య ప‌రిష్కారం కోసం చొర‌వ చూపిన ఏఎన్ఎన్ ఛాన‌ల్ మ‌హా ప‌త్రిక‌కు రైతులు ప‌శువుల య‌జ‌మానులు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Latest