Mahaa Daily Exclusive

  ప్రభుత్వ డిగ్రీ , పీజీ కళాశాలలో అంబ రాన్నింటిన బతుకమ్మ సంబరాలు..!

Share

బెల్లంపల్లి,మహ: తెలంగాణ సంస్కృ
తి, సంప్రదాయాలలో భాగమైన బతు
కమ్మ పండుగ సంబరాలు శుక్రవారం బెల్లంపల్లి డిగ్రీ, పీజీ కళాశాలలో అంబ
రాన్నంటాయి. కళాశాల ఉమెన్ ఎంప
వర్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఈ వేడు
కలను ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్ ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్లి శంకర్ తెలిపారు. ఏటా ఈ కార్యక్ర
మాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థిని, విద్యార్థులకు, అధ్యాప
కులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
.ఆటపాటలతో ఆకట్టుకున్న వేడుక..
ముందస్తు బతుకమ్మ సంబరాల కోసం కళాశాల మైదానంలో పెద్ద ఎత్తున షామియానా ఏర్పాటు చేశారు. అనం
తరం మహిళా అధ్యాపకులు, విద్యార్థి
నులు తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. అనంతరం ప్రిన్సి
పాల్ మరియు ఇతర అధ్యాపకులు కొబ్బరికాయలు కొట్టి బతుకమ్మ ఆట
ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా అధ్యాపకులు, విద్యార్థిను
లు, విద్యార్థులు అందరూ కూడా బతుకమ్మ ఆడారు. బతుకమ్మ బతుక
మ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. వెళ్లి రా బతుకమ్మ.. మళ్లీ రా బతుకమ్మ.. అంటూ ఆటపాటలతో హోరెత్తించారు. బతుకమ్మ పాటలకు తగ్గట్టుగా నృత్యాలు చేస్తూ కార్యక్ర
మాన్ని ఆద్యంతం ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. అనంతరం బతుకమ్మలను స్థానిక పోచమ్మ చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్లి శంకర్, వైస్ ప్రిన్సిపాల్ మేడ తిరుపతి, ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ ఎంఏ రేష్మ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అధ్యాప
కులు, సూపరింటెండెంట్ పుప్పాల శ్రీనివాస్,భోజనేతర సిబ్బంది

Latest