Mahaa Daily Exclusive

  జిల్లా గొర్ల‌ పెంప‌కం దార్ల సంఘ కార్య‌వ‌వ‌ర్గానికి కంది శ్రీ‌నివాస రెడ్డి స‌త్కారం..!

Share

ఆదిలాబాద్ : ఇటీవ‌ల జిల్లా గొర్ల పెంప‌కం దార్ల సంఘ ఎన్నిక‌లలో విజ‌యం సాధించిన సంఘ బాధ్యులు అధ్య‌క్షులు గవ్వల సాయి చైతన్య ,ఉపాధ్యక్షులుగా కెంద రాకేష్, కార్య‌ వర్గ సభ్యులు కె.రవి కాంత్, కేమ లక్ష్మణ్,వై. కిష్టయ్య, జి. వేణు గోపాల్ ,అసుర రమేష్ పాత దేవన్న ,గోర్ల రాజన్న శుక్ర‌వారం ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీ‌నివాస‌రెడ్డి క్యాంపు కార్యాల‌యాన్ని సంద‌ర్శించారు. వారికి సాద‌ర స్వాగ‌తం ప‌లికిన కంది శ్రీ‌నివాస రెడ్డి శాలువాల‌తో ఘ‌నంగా స‌త్క‌రించారు. కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున వారికి అభినంద‌న‌లు తెలిపారు. గొల్ల కురుమ‌లు అన్నిరంగాల‌లో అభివృద్ధి చెందాల‌ని ఆకాంక్షించారు. గొల్ల‌కురుమ‌ల ఐక్య‌త‌కు ఆర్థికాభివృద్ధికి నూత‌న కార్య‌వ‌ర్గం కృషి చేయాల‌ని కంది శ్రీ‌నివాస రెడ్డి అభిల‌షించారు. ఈ కార్య‌క్ర‌మంలో గిమ్మ సంతోష్ , తుమ్మ‌ల వెంక‌ట్ రెడ్డి , అల్చెట్టి నాగ‌న్న , ఫైజుల్లా ఖాన్ , గుడిప‌ల్లి న‌గేష్, కొండ గంగాధ‌ర్, బండారి స‌తీష్ , సందాన‌ర్సింగ్, రామ్ కుమార్ లోక‌ప్ర‌వీణ్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారుv

Latest