ఆదిలాబాద్ మహా : పేద బడుగు బలహీన వర్గాల సంక్షేం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. పేదల వైద్యఖర్చుల నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధినుండి వచ్చిన చెక్కులను ఆయన తన క్యాంపు కార్యాలయంలో లబ్దిదారులకు అందించారు. మొత్తం 14 లక్షల విలువ గల 27 చెక్కులను లబ్దిదారులకు అందించారు. సీయంఆర్ ఎఫ్ సహాయం కోసం తన క్యాంపు కార్యాలయం లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసామని ఆసుపత్రుల్లో డబ్బుల పెట్టి వైద్యం చేయించుకున్నవారికి ముఖ్య మంత్రి సహాయ నిధినుండి ఆర్థిక సాయంకోసం దరఖాస్తు పెట్టుకోవచ్చన్నారు.అటు చెక్కలు అందుకున్నవారు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృషి చేసిన కంది శ్రీనివాస రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గిమ్మ సంతోష్ , మునిగెల నర్సింగ్ , సామ రూపేష్ రెడ్డి ,నాగర్కర్ శంకర్ , అల్చెట్టి నాగన్న , ఫైజుల్లా ఖాన్ , గుడిపట్టి నగేష్, కొండ గంగాధర్, బండారి సతీష్ , సందానర్సింగ్, రామ్ కుమార్ లోకప్రవీణ్ రెడ్డి, మంచాల మల్లయ్య, రావుల సోమన్న యాదవ్,రమేష్ రాంరెడ్డి ,మహమూద్ ,లత, సోనియామంథని, ఉయిక ఇందిర తదితరులు పాల్గొన్నారు






