TG: హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలు, తీసుకుంటున్న చర్యలపై వివిధ విభాగాల అధికారులతో హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే మూడు రోజుల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు విధుల్లో ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజల నుండి ఫిర్యాదులు అందితే వెంటనే స్పందించాలన్నారు. అందుబాటులో ఉంచిన టోల్ ఫ్రీ నెంబర్లు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలిసేలా చేయాలన్నారు.
Post Views: 42






