AP: రాష్ట్రంలో మృతి చెందిన ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద పోస్టింగ్లు ఇచ్చినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. మొత్తం 3,441 మంది దీని కోసం దరఖాస్తు చేసుకోగా.. వారిలో 2,569 మందికి కారుణ్య నియామకాల కింద పోస్టులు భర్తీ చేసినట్లు వెల్లడించారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి అడిగిన ప్రశ్నకు లోకేశ్ సమాధానం చెప్పారు.
Post Views: 43








