రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-గాజా యుద్ధాలు కొనసాగుతున్న నేపథ్యంలో, భారత వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, “యుద్ధాన్ని ఎలా త్వరగా ముగించాలో భారత్‌ను చూసి ప్రపంచం నేర్చుకోవాలి” అని అన్నారు. మే నెలలో జరిగిన ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావిస్తూ, సైనిక సంఘర్షణలను ఎలా ప్రారంభించాలో, ఎలా ముగించాలో భారతదేశం నుంచి నేర్చుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.
Post Views: 55






