AP: వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ చేస్తున్న అభివృద్ధి చూసే తాము పార్టీలో చేరామని వెల్లడించారు. 6 నెలలుగా తమ రాజీనామాలు ఆమోదించడం లేదని తెలిపారు. అలాగే బల్లి కళ్యాణ్ మాట్లాడుతూ.. పార్టీలో చేరడం సొంతగూటికి వచ్చినట్లు ఉందని తెలిపారు. బేషరతుగానే టీడీపీలోకి చేరామని పేర్కొన్నారు. ఇక కర్రీ పద్మశ్రీ మాట్లాడుతూ.. వైసీపీలో కనీసం మాట్లాడే అవకాశం దొరకలేదని అందుకే రాజీనామా చేశామన్నారు.
Post Views: 52






