శ్రీకాళహస్తి దేవస్థానం పాలకమండలి చైర్మన్ పదవిని కొట్టే సాయికి ఇవ్వడంపై జనసేన మాజీ ఇంచార్జ్ వినూత కోట అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు లేఖ రాశారు. మహిళల పట్ల గౌరవం లేని వ్యక్తికి, తనపై జరిగిన రాజకీయ కుట్రలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తికి ఆలయ చైర్మన్ పదవి ఇవ్వడంపై పునరాలోచించాలని కోరారు. త్వరలో పూర్తి ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని వినూత కోట తెలిపారు.
Post Views: 65






