Mahaa Daily Exclusive

  రక్తదానం వల్ల ఇతరుల ప్రాణాలను కాపాడవచ్చు మంచిర్యాల జిల్లా కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్ కుమార్ దీపక్ ..!

Share

మంచిర్యాల, మహా : రక్తదానం చేయడంవల్ల ఇతరుల ప్రాణాలను కాపాడవచ్చని మంచిర్యాల జిల్లా కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు జన్మదినం సందర్భంగా ప్రభుత్వ కాలేజ్ రోడ్డు పద్మనాయక కళ్యాణ మండపంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో సొసైటీ జిల్లా ఛైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా గర్భిణులకు ప్రసవ సమయంలో, రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి అత్యవసర పరిస్థితులలో, సికిల్ సెల్ తల సేమియా వ్యాధిగ్రస్తుల ప్రాణాలు కాపాడవచ్చని అన్నారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చని అన్నారు. ఇలా రక్తం ఇవ్వడం వల్ల శరీరంలో నూతన రక్తం పెంపొంది ఆరోగ్యంగా ఉంటారని వెల్లడించారు. సికిల్ సెల్ తల సేమియా బాధితులకు రక్తం అవసరం ఎప్పటికీ ఉంటుందని చెప్పారు. చదువుకున్న యువత రక్తదాన శిబిరాలలో స్వచ్ఛందంగా పాల్గొని ప్రజల ప్రాణ రక్షణలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. పోలీస్, ఇతర శాఖల వారీగా స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో రక్తదాన శిబిరాలు నిర్వహించి యూనిట్లను సేకరించి ప్రజల ప్రాణ రక్షణలో భాగస్వామ్యులు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
మెగా రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా పాల్గొని రక్త దానం చేయడం అభినందనీయమని తెలిపారు. అనంతరం రక్తదాతలకు ధ్రువపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Latest