Mahaa Daily Exclusive

  బతుకమ్మ పండుగ మహిళల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తుంది: భట్టి

Share

TG: తెలంగాణ సంస్కృతికి గర్వకారణమైన బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. వరంగల్ వేయిస్తంభాల గుడిలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో మంత్రులతో కలిసి పాల్గొని మాట్లాడారు. ‘ఈ పండుగ మన మట్టి వాసనను, మన సంస్కృతి సౌందర్యాన్ని, మన మహిళల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తుంది. మన తెలంగాణ తల్లి ఆశీర్వదించి ప్రతి ఇల్లు ఆనందవనంలా మారాలి’ అని కోరారు.

Latest