ఖమ్మంలోని తెలంగాణ భవన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ తాత మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలతో సందడి చేశారు. బతుకమ్మల చుట్టూ చేరి ఉయ్యాల పాటలు పాడారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, ఇది ఆడబిడ్డలకు ఎంతో ఇష్టమైన పండగ అని, ప్రతి మహిళకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా తెలిపారు.
Post Views: 25






