తొమ్మిది రోజుల పాటు సాగే బతుకమ్మ పండుగ ఖమ్మం కలెక్టరేట్ లో ఎంగిలి పూల బతుకమ్మతో ఘనంగా ప్రారంభమైంది. మహిళలు, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల ఉద్యోగులు కలిసి ఈ వేడుకలను నిర్వహించారు. జిల్లా సంక్షేమ అధికారి కె. రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, బతుకమ్మ కుటుంబ సభ్యులను ఒకచోట చేర్చి ప్రకృతితో మమేకం చేసే పండుగ అని, ఇది తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు.
Post Views: 25






