Mahaa Daily Exclusive

  ప‌నిభారం త‌గ్గించాలి ఏఐటీయూసీ..!

Share

ఆదిలాబాద్ మ‌హా: మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి.. వారిపై పని భారాన్ని తగ్గించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్. విలాస్ డిమాండ్ చేశారు. స్థానిక సీపీఐ పార్టీ కార్యాలయంలో సోమవారం మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్వర్కర్స్ యూనియన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా మున్సిపల్ కార్మికుల సమస్యలపై చర్చించి పలు విషయాలను
తెలియజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ మాట్లాడుతూ…మున్సిపల్ కార్మికులపై పెరుగుతున్న పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికుడికి 2 జతల యూనిఫాం, కుట్టుకూలీ ఇవ్వాలని,గ్లౌజులు, గమ్ బూట్లు ,సబ్బులు, నూనె, బెల్లం ఇవ్వాలన్నారు. పెండింగ్లో ఉన్నఏరియ‌ర్స్ కూడా విడుదల చేయాలన్నారు. సమస్యలు పరిష్కారం కానీ పక్షంలో యూనియన్ తరపున ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్రదేవేందర్,డిప్యూటి ప్రధాన కార్యదర్శి గాజేంగుల రాజు, మున్సిపల్ యూనియన్ జిల్లా ప్రధానకార్యదర్శి మంతెన

Latest