Mahaa Daily Exclusive

  రోడ్డు విస్తరణకు బెల్లంపల్లి పట్టణ ప్రజలు సహకరించాలి మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ …!

Share

బెల్లంపల్లి, మహ: బెల్లంపల్లి పట్టణ అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడు
తున్న రోడ్డు విస్తరణకు ప్రజలంతా సహకరించాలని మున్సిపల్ కమిష
నర్ తన్నీరు రమేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం రోజు మున్సి
పల్ కార్యాలయంలో ఆయన మాట్లా
డుతూ రోడ్డు విస్తరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలంతా సహకరించాలన్నారు. మొదటి దశలో కాల్ టెక్స్ట్ ఫ్లైఓవర్ నుండి కాంటా చౌరస్తా వరకు 100 ఫీట్ల రోడ్డును ఏర్పాటు చేయడం జరుగుతుందని అందులో భాగంగా రోడ్డును ఆనుకొని ఉన్న వ్యాపారులకు ఇంటి యజమా
నులకు నోటీసులు సైతం మున్సిపల్ శాఖ తరపున అందజేశామని స్వచ్ఛం
దంగా తొలగించుకునేందుకు మార్కిం
గ్ సైతం ఏర్పాటుచేసి ప్రజలకు సూచిం
చామని తెలిపారు. టి యు ఎఫ్ ఐ డి సి పథకం కింద 6.7 కోట్ల రూపాయల
తో రోడ్డు విస్తరణ కార్యక్రమానికి నిధు
లను కేటాయించడం జరిగిందని 2022వ సంవత్సరంలోనే రోడ్డు విస్తర
ణ పనులు మంజూరు కాగా అనివార్య కారణాలరీత్యా వాయిదా వేయడం జరిగిందని ప్రస్తుతం రోడ్డు నిర్మించేందు
కు సిద్ధమయ్యామని తెలిపారు. రోడ్డు విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టేందుకు మార్కింగ్లను సైతం ఏర్పాటు చేసి సంబంధిత యజమానులకు వ్యాపారు
లకు నోటీసులు అందజేయగా అందు
లో కొంతమంది న్యాయస్థానాన్ని ఆశ్ర
యించడం జరిగిందని కోర్టు తీర్పు అనంతరం రోడ్డు విస్తరణ కార్యక్రమా
న్ని చేపడతామని వెల్లడించారు .రోడ్డు విస్తరణ కార్యక్రమాన్ని ఆపివేసేందుకు కొంతమంది దళారులు వ్యాపారుల వద్ద నుండి నిధులను సేకరిస్తున్నట్టు సమాచారం తెలిసిందని రోడ్డు విస్తరణ కార్యక్రమంలో దళారులను నమ్మవ
ద్దని రోడ్డు విస్తరణ కార్యక్రమాన్ని అప్ర
దిష్ట పాలు చేసేందుకు ప్రయత్నించే దళారులను గుర్తించి తమకు తెలిపి
నట్లైతే చట్టరీత్యా చర్యలు తీసుకుం
టామని హెచ్చరించారు.

Latest