ఆదిలాబాద్ మహా : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను జిల్లా ప్రజలు ప్రశాంతంగా భక్తి శ్రద్దలతో నిర్వహించుకోవాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. జిల్లాప్రజలకు దుర్గా శారద దేవి నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దుర్గా నవరాత్రి ఉత్సవాలు , నిమజ్జనం శోబాయాత్రలలో డీజే లకు అనుమతులు లేవని సుప్రీంకోర్టు నియమ నిబంధనలను లోబడి సౌండ్ బాక్స్ లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గణపతి నవరాత్రి ఉత్సవాలలో నిబంధనలు ఉల్లంఘించిన జిల్లా వ్యాప్తంగా 15 మంది డీజే యజమానులపై కేసుల నమోదు చేసి డీజేలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. రాత్రి సమయాలలో మహిళలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో శారదా దేవి మండప కమిటీల వద్ద ప్రత్యేకంగా మహిళా సిబ్బంది, షీ టీం బృందాలచే నిఘా ఏర్పాటు చేయబడుతుందని తెలిపారు. మహిళలకు ఈవిటీజింగ్ కు, ఆకతాయిలు వేధింపులకు, వికృతి చేష్టలకు ఎలాంటి ఆస్కారం లేకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మహిళలు ఎలాంటి అత్యవసర సమయంలోనైనా డయల్ 100 ద్వారా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించి సహాయాన్ని పొందవచ్చును సూచించారు. రాత్రి సమయాలలో యువత అనవసరంగా తిరగడం మానివేయాలని సూచించారు. మహిళలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో యువత, తెలియని వారు వారిని వీడియోలు తీయడం, వికృత శాష్టాలు చేయడం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా మండపాలలో యువత రాత్రి సమయాలలో నిద్రించే విధంగా సరైన ఏర్పాట్లను చేసుకోవాలని సూచించారు. వీలైనంతవరకు మండపాల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలన్నారు. మహిళలు చైన్ స్నాచింగ్ పట్ల అప్రమత్తతో వ్యవహరించాలని సూచించారు, పోలీసు యంత్రాంగం పెట్రోలింగ్ గస్తీ నిర్వహిస్తూ పర్యవేక్షిస్తుందని తెలిపారు. దుర్గా నవరాత్రి ఉత్సవాలలో పట్టణంలో ప్రత్యేకంగా క్లస్టర్ మరియు సెక్టార్ స్థాయి గా విభజించి బందోబస్తు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల నందు పికెట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు .దసరా పండగకి సొంత ఊర్లకు వెళ్లేవారు దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని, విలువైన సామాగ్రిని వస్తువులను ఇంట్లో ఉంచకుండా చూడాలని తెలిపారు. ముఖ్యంగా నిమర్జనం ఉత్సవాలను నిర్ణీత సమయంలో పూర్తిచేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మండప కమిటీ సభ్యులు ,హిందు ఉత్సవ సమితి సభ్యులు పర్యవేక్షించాలని సూచించారు.






