Mahaa Daily Exclusive

  ఇకపై ఏ సినిమా టికెట్ ధరలను పెంచేది లేదు: మంత్రి కోమటిరెడ్డి

Share

TG: ఓజీ సినిమా టికెట్ ధరలను పెంచడాన్ని సవాల్ చేస్తూ మహేశ్ యాదవ్ అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. కొత్త సినిమాల టికెట్ల ధరలను పెంచడాన్ని సస్పెండ్ చేసింది. తాజాగా హైకోర్టు జారీ చేసిన ఈ ఉత్తర్వులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. సినిమా టికెట్ ధరలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నామని తెలిపారు. ఇకపై ఎలాంటి సినిమాలకైనా టికెట్ ధరలను పెంచుకునేలా అనుమతులు ఇవ్వబోమని మంత్రి స్పష్టం చేశారు.

Latest