AP: తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని తాను కోరుకుంటున్నానని, ఆయన నిర్ణయమే తనకు శిరోధార్యమని తెలిపారు. ఐదేళ్ల తర్వాత రాజకీయాల్లో పోటీ చేయనని, ప్రజలు సేవ చేసేవారినే ఎన్నుకుంటారని ఆయన పేర్కొన్నారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని, పవన్ కళ్యాణ్ ముక్కుసూటిగా మాట్లాడతారని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం నిధుల కొరతతో ఇబ్బంది పడుతోందని, చిరంజీవి స్ఫూర్తితోనే పవన్ రాజకీయాల్లోకి వచ్చారని ఆయన పేర్కొన్నారు.
Post Views: 20







