AP: గత ప్రభుత్వ హయాంలో అందరూ బాధితులేనని, తాను ఎప్పుడూ తప్పు చేయనని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎవరైనా తప్పులు చేస్తే వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తానని పేర్కొన్నారు. గతంలో తనపై ఎవరూ కేసులు పెట్టలేదని, ఏ తప్పూ చేయనందుకే కేసులు పెట్టేందుకు భయపడతారని వెల్లడించారు. కానీ వైసీపీ హయాంలో తనపై 17 కేసులు పెట్టినట్లు గుర్తు చేశారు. అయితే ప్రజలు నమ్మకంతో నాలుగోసారి సీఎంను చేశారంటూ వ్యాఖ్యానించారు.
Post Views: 22







