TG: అర్బన్ ప్రాంతాల్లో పెండింగ్‍లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలతో పాటు సొంత స్థలాలు కలిగిన వారికి ఇండ్ల నిర్మాణం విషయంలో ప్రభుత్వం అతి త్వరలో నిర్ణయం తీసుకుంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. గడిచిన పదేళ్లలో ఏడాదికి లక్ష ఇళ్లు నిర్మించి ఇస్తే ఈ పాటికి పది లక్ష ఇళ్లు పేదలకు దక్కేవన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఇండ్ల విషయంలో తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. అర్హులైన వారందరికీ ఇళ్లు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
Post Views: 23






