TG: యువతలో క్రీడా నైపుణ్యాలను ప్రోత్సహించడానికి, క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ.480 కోట్లు కేటాయించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో 17వ నేషనల్ మినీ హ్యాండ్‌బాల్ బాయ్స్, గర్ల్స్ చాంపియన్ షిప్ పోటీలను మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 22 జట్లు పాల్గొంటున్నాయి. సీఎం రెవంత్ రెడ్డి నాయకత్వంలో క్రీడలకు ప్రాధాన్యం దక్కుతోందని, యువత ఒలింపిక్ చాంపియన్లుగా ఎదగాలని మంత్రి పేర్కొన్నారు.
Post Views: 19






