ఆదిలాబాద్ మహా : కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ల పార్టీ అని ఎప్పుడు కూడా పేదల సంక్షేమం కోసమే పని చేస్తుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని 44వ వార్డు లోని డాల్డాకంపెనీ కాలనీ లో రఫీక్ , సలీం ఆధ్వర్యంలో జరిగిన చేరికల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.కాంగ్రెస్ శ్రేణులు కాలనీ వాసులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పదేళ్లుగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభత్వం మన రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. పేదల సంక్షేమాన్ని పట్టించుకోవడంలేదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం పని చేస్తూ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తూ పేదల సొంతింటి కల తీరిస్తే ఎమ్మెల్యే పాయల్ శంకర్ అవి బీజేపీ ఇస్తున్నట్టుగా చెప్పకుంటున్నాడని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే పేదల గురించి ఆలోచించి పని చేస్తుందన్నారు. పేదలకు ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా సన్న బియ్యం ఇస్తుందన్నారు. కేంద్రం గ్యాస్ సిలిండర్ ధరను వెయ్యికి పైగా పెంచితే మన ప్రభుత్వం సబ్సిడి భరించి పేదలకు ఐదు వందలకే అందిస్తుందన్నారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ , కొత్త రేషన్ కార్డులు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. తన గరీబోళ్ల పక్షమని పేదలకు ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి సిద్దంగా ఉంటానన్నారు. కాంగ్రెస్ పార్టీని,తనను నమ్మి చేరుతున్న వారందరిని కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు.అందరికి అండగా ఉంటానని ఎళ్లవేలలా అందుబాటులో ఉంటానని అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపించుకోవాలని అందరం కలిసి కట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్ట సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని,ఇమ్రాన్ , ఖిజర్ పాషా, గిమ్మ సంతోష్ రావు, కోలా నరసింహులు, లోక ప్రవీణ్ రెడ్డి, ప్రశాంత్, పోతారెడ్డి, ఎంఏ షకీల్, రఫీక్ ,ఖలీం, నరేష్, శరత్,కొండూరి రవి, మానే శంకర్, ఇర్ఫాన్, ఖమర్ బేగం తదితరులు పాల్గొన్నారు.






