AP: రాజమండ్రి జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదలయ్యారు. తాజాగా ఏసీబీ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయగా.. ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. జులై19న అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి 71 రోజుల పాటు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సోమవారం కొన్ని షరతులతో ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కె. ధనుంజయ్ రెడ్డి, పి. కృష్ణమోహన్ రెడ్డితో పాటు భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజి గోవిందప్పకు కూడా ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేయడం గమనార్హం. ఈ స్కామ్‌పై ఏసీబీతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దర్యాప్తు చేస్తోంది.
Post Views: 22







