నిర్మల్, మహా : నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం న్యూ లోలం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ళను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కూచారి శ్రీహరిరావు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడారు. త్వరగా నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలను విడతలవారీగా లబ్ధిదారులకు అందిస్తుందని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ నూతన గృహాలను నిర్మించిందని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నూతన గృహాలను నిర్మించలేదని మళ్లీ ఇందిరమ్మ రాజ్యంలోనే నూతన గృహాలను నిర్మించి పేదవారికి బహుమతిగా ఇస్తుందని అన్నారు. ఎవరైనా నిరుపేదలు డబ్బు లేకుండా ఉన్నట్లయితే సమాఖ్య సంఘాల నుండి లక్ష రూపాయల రుణం తీసుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి,మాజీ ఎంపీపీ పాల్దే అనిల్, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ అంగూరి మహేందర్, శ్రీ కదిలి పాప హరేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ నర్వాడే వెంకట రావు, కాల్వ దేవస్థానం ఆలయ ధర్మకర్త నర్సయ్య, సప్పల రవి, అరుగుల రమణ, గోవిందుల మహేష్ తదితరులున్నారు.






