Mahaa Daily Exclusive

  సాహితీ కిరీటి అవార్డు గ్రహీతలకు స‌త్కారం..!

Share

ఆదిలాబాద్ మ‌హా : ఇటీవ‌ల శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్మ‌ల్ జిల్లా కవులు చేస్తున్న సాహితీ సేవలను గుర్తించి హైదరాబాదులో సాహితీ కిరీటి అవార్డు పొందిన కవులను స్థానిక సాహితీ వేత్త‌లు ఘనంగా సన్మానించారు.ఈసంద‌ర్భంగా సోమ‌వారం నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోని తెర‌వే కార్యాల‌యంలో తెలంగాణ సాహితీ సాంస్కృతిక భాష,యాసల ను ప్రతిబింబించే విధంగా ఎన్నో రచనలు చేస్తున్న పుర‌స్కార గ్ర‌హీత‌లు డాక్టర్ తుమ్మల దేవరావు,పత్తి శివప్రసాద్,పోలీస్ భీమేష్ ల‌ను తెలంగాణ రచయితల వేదిక నిర్మల్ జిల్లా తరఫున శాలువా మెమెంటోతో సత్కరించారు. నిర్మల్ కవులు జాతీయస్థాయిలో అవార్డులు తెచ్చుకునే స్థాయికి ఎదిగారని తెరవే ఉపాధ్యక్షులు డాక్టర్ కృష్ణమరాజు అన్నారు. ముందు ముందు ఇంకెన్నో గొప్ప పురస్కారాలు తీసుకురావాలని అభిల‌షించారు. ఆ దిశగా రచనలు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో తెరవే నిర్మల్ జిల్లా అధ్యక్షుడు నేరెళ్ల హనుమంతు, క‌వులు బొందిడి పురుషోత్తమ రావు, కుమ్మరి నాగారం, టి. డి. ఏ.జిల్లా అధ్యక్షులు తిప్రిస్ సంతోష్ కుమార్ ప‌లువురు కవులు రచయితలు పాల్గొన్నారు

Latest