Mahaa Daily Exclusive

  దుర్గాదేవి మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే నాయిని ..!

Share

హన్మకొండ మహా;

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పశ్చిమ నియోజకవర్గం లోని పలు దేవాలయాలను దుర్గామాత మండపాలను పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సందర్శించారు.
ఇందులో భాగంగా సోమవారం ఉదయం హన్మకొండలో గల శ్రీ శ్రీ శ్రీ సిద్దేశ్వర దేవాలయాన్ని నాయిని రాజేందర్ రెడ్డి తన అల్లుడు విష్ణు వర్ధన్ రెడ్డి
తో కలిసి సందర్శించి ఆలయ పండితుల వేదమంత్రాల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం 54వ డివిజన్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని సందర్శించి పూజాలు నిర్వహించారు. తదనంతరం 4వ డివిజన్లో ఫ్రెడ్స్ యూత్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అత్యంత భారీ దుర్గామాత విగ్రహన్ని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా 52 అడుగుల భారీ విగ్రహన్ని ప్రతిష్టించిన కమిటీ సభ్యులను అభినందించారు.
కాజీపేటకు చెందిన కడిపికొండ, విష్ణుపురి వాటర్ ట్యాంక్ పోలిస్ స్టేషన్ వద్ద గల మండపాలను సందర్శించి పూజలు నిర్వహించారు.
అలాగే వరంగల్ మాట్టెవాడ, ఎంజీఎం కూడలిలో ఏర్పాటుచేసిన దుర్గామాత మండపాలను సందర్శించి దుర్గామాతను దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమాలలో కార్పొరేటర్లు పోతుల శ్రీమాన్, జక్కుల రవీందర్, సయ్యద్ విజయ రజాలి, గుంటి శ్రీనివాస్, రవీందర్, కాంగ్రెస్ బ్లాక్ ప్రెసిడెంట్లు స్థానిక డివిజన్ ప్రెసిడెంట్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, యువ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Latest