Mahaa Daily Exclusive

  బతుకమ్మ ను పేర్చిన గంట నవనీత..!

Share

వరంగల్ మహా;

తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ.. ఓ సంబురం..ఓ సంతోషం అని తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని గంట నవనీత అన్నారు‌. సగటు తెలంగాణ ఆడపడుచుకు ఇంతకంటే పెద్ద పండగ ఏదీ లేదని ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూలను దేవతలా కొలిచే అరుదైన పండుగ. తీరొక్క పూలను తెచ్చి.. అందంగా పేర్చి.. బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ ఆటపాటలతో భక్తి శ్రద్ధలతో ప్రకృతిని, పూలను పూజించే గొప్ప పండుగ ఈ బతుకమ్మ అని తెలిపారు. బతుకమ్మ పండుగలో చివరి రోజు సోమవారం సద్దుల బతుకమ్మ సందర్భంగా వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గంట రవికుమార్ సతీమణి నవనీత బతుకమ్మను పేర్చి మహిళలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఆడి పాడారు.

Latest