Mahaa Daily Exclusive

  హమాలీ కార్మికులకు దసరా కానుక బియ్యం పంపిణీ..!

Share

కాటారం, మహా : కాటారం మండలం గారేపల్లి హమాలి సంఘం కార్మికులకు దసరా కానుకగా సోమవారం బియ్యం పంపిణీ చేశారు. కాటారం డివిజన్ హనుమాన్ దీక్ష సేవాసమితి కి చెందిన జంగ సమ్మయ్య గారు పల్లి అమలు సంఘం వద్ద జరిగిన కార్యక్రమంలో ఒక్కో హమాలీ కార్మికుడికి పది కిలోల చొప్పున దసరా పండుగ నేపథ్యంలో బియ్యం పంపిణీ చేశారు. కాటారం డివిజన్లో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జంగ సమ్మయ్య ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటున్నారని పలువురు అభినందించాలి ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా పిరమిడ్ స్పిచ్చువాల్ మూమెంట్ సేవాదళ్ అధ్యక్షులు అనంతుల రమేష్ బాబు బిజెపి నాయకులు దుర్గం తిరుపతి, బొంతల రవీందర్, హనుమాన్ దేవాలయ కమిటీ చైర్మన్ కొట్టే శంకరయ్య, హమాలి సంఘం అధ్యక్షుడు లింగయ్య, మంత్రి రాజయ్య హమాలీ కార్మికులు పాల్గొన్నారు.

Latest