హన్మకొండ మహా;
ప్రహరీ గోడ నిర్మిత పనులను త్వరగా పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు.
సోమవారం హన్మకొండ లోని వెహికల్ షెడ్ ప్రాంతం లో నిర్మిస్తున్న కాంపౌండ్ వాల్ నిర్మిత పనులతో పాటు సమీపం లో గల రెండు పడకల గదులు సముదాయం (2 బి హెచ్ కే) లో నీటి సరఫరా వసతి కల్పన కోసం చేయాల్సిన ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భం గా కమిషనర్ మాట్లాడుతూ హన్మకొండ లోని బాల సముద్రం లో గల వెహికల్ షెడ్ ప్రాంతం లో బల్దియా నిర్మిస్తున్న కాంపౌండ్ వాల్ పనులను వేగవంతం గా పూర్తి చేయాలని ఆదేశించారు.
అనంతరం అదే ప్రాంతం లో గల రెండు పడకల గదులు సముదాయం లో క్షేత్ర స్థాయిలో సందర్శించి ప్రస్తుతం నివాసం ఉంటున్న వారికి నీటిని వినియోగించుకోవడానికి వీలుగా సంయుక్తం గా సంప్ ఉందని అట్టి సంపు నకు కార్పొరేషన్ నీటిని సరఫరా చేస్తుందని సంపు నుండి వాటర్ ట్యాంక్ నకు వాటర్ ను పంపించాల్సిన అవసరం ఉందని అట్టి పనులను వెంటనే పూర్తి చేయాలని అన్నారు.ఇదే ప్రాంతం లో డ్రైనేజీ వ్యవస్థను కమిషనర్ పరిశీలించారు.
ఈ కార్యక్రమం లో ఏం హెచ్ ఓ డా.రాజేష్ ఈ ఈ రవి కుమార్ డి ఈ లు రాజ్ కుమార్ రాగి శ్రీకాంత్ సానిటరీ సూపర్ వైజర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.c








