Mahaa Daily Exclusive

  2300 సిమెంట్ బ్యాగులతో 9000 ఎస్.ఎఫ్.టి.తో పిటి స్లాబ్ మంచిర్యాల సాగర్ సిమెంట్ డిస్ట్రిబ్యూటర్స్ రాజ్ కుమార్ రెన్వ ..!

Share

మంచిర్యాల, మహా : 2300 సాగర్ సిమెంట్ బ్యాగులతో 9000 ఎస్.ఎఫ్.టి.తో పిటి స్లాబ్ వేసి మంచిర్యాల జిల్లా కేంద్రంలో చరిత్ర సృష్టించినట్లు సాగర్ సిమెంట్ డిస్ట్రిబ్యూటర్స్ రాజ్ కుమార్ రెన్వ వెల్లడించారు. మంగళవారం వేంపల్లిలో పెద్ద స్లాబ్ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సాగర్ సిమెంట్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ రాజ్ కుమార్ రెన్వ, కంపెనీ ఇంజనీర్ అభిలాష్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సేల్స్ ఇన్చార్జి నరేష్ రెడ్డి యోగేష్ రెన్వ లు మాట్లాడుతూ ఈ స్లాబ్ నిర్మాణంతో సాగర్ సూపర్ చరిత్ర సృష్టించిందని వెల్లడించారు. పెద్ద భవనాల నిర్మాణాలను అతి త్వరలో పూర్తి చేయాలంటే సాగర్ సూపర్ క్యూరింగ్ అగ్రగామని తెలిపారు. సమయం తక్కువలోనే సిమెంట్ ఐరన్ తో కలిసిపోయి గట్టిగా మారిపోతుందని అన్నారు. ప్రతి కట్టడ నిర్మాణాల్లో గ్రౌండ్ స్థాయి నుండి సాగర్ సూపర్ సిమెంట్ వాడటంతో బలిష్టమైన గట్టితనం నిర్మాణాలకు వస్తుందని వివరించారు. నిర్మాణం ప్రాథమిక దశ నుండే ఈ సిమెంట్ వాడకం అత్యవసరమని తెలిపారు.

Latest