బోనకల్ మహా అక్టోబర్ 2
దసరా ఉత్సవాలు సందర్భంగా రావినూతల గ్రామంలో యాదవుల బజారులో కొలువైయున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో మహిళలు చిన్నారులు తెల్లవారుజామున లేచి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొని మరియు రంగురంగుల పువ్వులతో బతుకమ్మలను తయారు చేసుకొని ఆటపాటలతో నృత్యాలతో అంగరంగ వైభవంగా ఎంతో ఉత్సాహముతో దసరా నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ, కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవ కమిటీ యాదవ్ యూత్ కమిటీ సభ్యులు జోనీబోయిన అంజయ్య, జోనీబోయిన గోవిందు, మందకృష్ణ, నల్ల గొర్ల కృష్ణ, గమిడి విరంజి, ఆవుల లక్ష్మీనారాయణ, జోనీబోయిన గురవయ్య, పుచ్చకాయల నాగేశ్వరరావు, పుచ్చకాయల ధనయ్య, పుచ్చకాయల నాగరాజు, ఆవుల పరశురాం, నల్లగొర్ల గోవిందరావు, గుండగానీ రాంబాబు, జొన్నలగడ్డ నాగేశ్వరరావు, చేబ్రోలు భూపతిరావు, గమ్మిడి నరసింహారావు, గమిడి సీతారాములు,మరియు గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






