Mahaa Daily Exclusive

  దుర్గామాత పూజ‌లో కంది శ్రీ‌నివాస రెడ్డి దంప‌తులు..!

Share

ఆదిలాబాద్ మ‌హా: విజ‌య ద‌శ‌మి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి త‌న స‌తీమ‌ణి కంది మౌనా శ్రీ‌నివాస రెడ్డితో క‌లిసి ప్ర‌జాసేవాభ‌వ‌న్ లో ద‌స‌రా వేడుక‌ల‌ను నిర్వ‌హించారు. వేద పండితుల‌చే శాస్త్రోక్తంగా దుర్గామాత ను పూజించారు. ప్ర‌జ‌లంద‌రూ సుఖ సంతోషాల‌తో , సిరిసంప‌ద‌ల‌తో,ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని అమ్మ‌వారిని వేడుకున్నారు. క్యాంపు కార్యాల‌య ప్ర‌ధాన ద్వారం ముందు గుమ్మ‌డి కాయ ప‌గ‌ల‌గొట్టి దిష్టి తీసారు. అనంత‌రం పూల మాల‌ల‌తో అంక‌రించిన త‌న అన్ని వాహ‌నాల‌కు పూజ‌లు నిర్వ‌హించారు.ఈ కార్యక్ర‌మంలో మున్సిప‌ల్ మాజీ వైస్ చైర్మన్ జ‌హీర్ రంజానీ, సీనియ‌ర్ నాయ‌కులు గిమ్మ‌సంతోష్, కొండ గంగాధ‌ర్, మునిగెల‌ విఠ‌ల్, ఏవ‌న్,భూపెల్లి శ్రీ‌ధ‌ర్, గుడిప‌ల్లి న‌గేష్, శాంత‌న్ రావు, సాయిచ‌ర‌ణ్ గౌడ్ ,బండారి స‌తీష్, సందా న‌ర్సింగ్, పోరెడ్డి కిష‌న్, రాజేశ్వ‌ర్ శ్రీ‌లేఖ‌,సుధాక‌ర్ గౌడ్, ఎంఏ ష‌కీల్, కొండూరి ర‌వి,అల్చెట్టి నాగ‌న్న‌, ర‌ఫీక్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Latest