Mahaa Daily Exclusive

  బ‌తుక‌మ్మ సంబ‌రాలలో కంది మౌనా శ్రీ‌నివాస రెడ్డి ..!

Share

ఆదిలాబాద్ మ‌హా : జిల్లాలోని డైట్‌ కళాశాల మైదానంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ కాంగ్రెస్‌ అసెంబ్లీ ఇంచార్జ్‌ కంది శ్రీనివాసరెడ్డి సతీమణి కంది మౌన శ్రీనివాస రెడ్డి, జిల్లా ట్రైనీ కలెక్టర్‌ సలోని చాబ్రా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ వేడుకకు స్థానిక మహిళలు భారీగా తరలివచ్చారు. వారితో కలిసి కంది మౌనా శ్రీనివాస రెడ్డి, సలోని చాబ్రా బతుకమ్మ పాటలకు ఆడిపాడారు. ఈ కార్య‌క్ర‌మంలో స‌నాత‌న హిందూ ఉత్సవ‌ స‌మితి అధ్య‌క్షులు ప్ర‌మోద్ ఖ‌త్రి ఇత‌ర కార్య‌వ‌ర్గ స‌భ్యులు,కాంగ్రెస్ నాయ‌కురాలు శ్రీ‌లేఖ‌,ప‌ట్ట‌ణానికి చెందిన మ‌హిళ‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Latest