Mahaa Daily Exclusive

  చంద్రబాబు అధ్యక్షతన నేడు కేబినెట్ భేటీ..!

Share

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం కేబినెట్ భేటీ జరగనుంది. ఈ నెల 16న ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు సంబంధించిన ప్రణాళికపై మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే కొత్త జిల్లాల ఏర్పాటు, రేపు ఆటో డ్రైవర్లకు అందించనున్న రూ.15 వేల సాయంపై చర్చించనున్నారు. అమరావతిలో అభివృద్ధి పనులు, పలు సంస్థలకు భూ కేటాయింపులపై చర్చించి సీఆర్‌డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపనున్నారు.

Latest