దసరా పండుగను పురస్కరించుకొని, కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి రెండో కమిటీని ప్రకటించారు. గురువారం రాత్రి విడుదల చేసిన ఈ జాబితాలో గిరిజన నేత లకావత్ రూప్ సింగ్ నాయక్ ను తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించి సంచలనం సృష్టించారు. సామాజిక కోణంలో ఈ కమిటీని కూర్పు చేసినట్లు తెలుస్తోంది. ఈ నియామకాలు వెంటనే అమలులోకి వస్తాయని, కొత్త బాధ్యతలు అప్పగించిన వారు సంస్థ ఆశయాలకు అంకితమై పని చేయాలని కవిత ఆకాంక్షించారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు.
Post Views: 38








