Mahaa Daily Exclusive

  ముగిసిన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు..!

Share

AP: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిన్నటితో ముగిశాయి. గత నెల 24న ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమయ్యారు. చివరి రోజు శ్రీవారు బంగారు తిరుచ్చి వాహనంపై రుక్మిణీ సత్యభామ సమేత కృష్ణుడి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ వాహన సేవల్లో మాడ వీధుల్లో వేంకటేశ్వరుడు ఊరేగారు. లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.