రిషబ్ శెట్టి దర్శకత్వంలో నటించిన ‘కాంతార చాప్టర్ 1’ సినిమా ఎనిమిది భాషల్లో విడుదలైంది. భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ రూ. 125 కోట్లకు దక్కించుకుంది. నవంబర్ తొలి వారంలో ఓటీటీలో అందుబాటులోకి రానుంది. శాటిలైట్ రైట్స్ 80 కోట్లు, ఆడియో హక్కులు 30 కోట్లు బిజినెస్ చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడానికి రూ. 101 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది.
Post Views: 51








