- రిలీఫ్, రెస్పీ ఫ్రెష్-టీఆర్ సిరప్‌లపై నిషేధం
- రెండింటిలోనూ కల్తీ తేలడంతో నిలిపివేయాలని సర్కార్ ఆదేశం
హైదరాబాద్, మహా: పిల్లలకు దగ్గు మందు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో రెండు దగ్గ మందులపై రాష్ట్రంలో నిషేధం విధించింది. ఇటీవలే కోల్డ్ రిఫ్‌ను పూర్తిగా నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా రిలీఫ్, రెస్పీ ఫ్రెష్-టీఆర్ సిరప్‌లపై నిషేధం విధించింది. ఈ రెండింటిలోనూ కల్తీ జరిగిందని తేలడంతో విక్రయాలను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇవి గుజరాత్‌కు చెందిన ఫార్మా కంపెనీల ఔషధాలుగా పేర్కొన్నారు అధికారులు.
ప్రజలు జాగ్రత్తగా ఉండాలి..
దగ్గు మందుల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సూచించింది. ఈ మేరకు ప్రజారోగ్యం విభాగం హెచ్చరించింది. తగిన నివారణ చర్యలతో పిల్లలకు వచ్చిన దగ్గు, జలుబును కట్టడి చేయవచ్చని తెలిపింది. వెంటనే తగ్గిపోవాలని ఇష్టం వచ్చినట్టుగా మందులు వాడితే పిల్లల ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరించింది. రెండు సంవత్సరాలలోపు పిల్లలలకు దగ్గు మందు ఇవ్వకూడదని సూచించింది. ఐదేళ్లలలోపు చిన్నారులకు కూడా అత్యవసరం అయితేనే ఇవ్వాలని తెలిపింది.








