Mahaa Daily Exclusive

  సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ గవాయ్ పై దాడి న్యాయవ్యవస్థపై దాడి.. ప్రతి భారతీయుడు దాడిని ఖండించాలి..

Share

విజయనగరం, మహా పత్రిక.
సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పై జరిగిన దాడి మన న్యాయవ్యవస్థపై,రాజ్యాంగ స్ఫూర్తి పై జరిగిన దాడిగా భావించాలని కారుణ్య ఫౌండేషన్ మరియు రోటరీ జిల్లా చైర్మన్ జె సి రాజు అన్నారు. మంగళవారం ఆయన పాత్రి కేయులతో మాట్లాడుతూ సి జె ఐ పై జరిగిన దాడి ని ఆయన తీవ్రంగా ఖండించారు. అలాంటి విద్వేష చర్యలకు మనదేశంలో స్థానం లేదని అన్నారు. ప్రతిభారతీయుడు ఈ చర్యను ఖండించాలన్నారు సుప్రీంకోర్ట్ లో షూ విసిరిన న్యాయవాది చర్యను తేలికగా తీసుకోకూడదని ,ఈ సంఘటనను క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని నిందితుడు,తన వెనుక ఉన్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇలాంటి పరిస్థితుల్లో సి జె ఐ కక్ష చర్యలకు పోకుండా ఆయన ప్రదర్శించిన మానవత్వం,విలువలు న్యాయవ్యవస్థ పై ఉన్న దృఢత్వం ప్రశంసనీయం అని అన్నారు.