Mahaa Daily Exclusive

  ఒరిస్సా నుంచి బస్సులో వస్తున్న 20 కేజీల గంజాయి స్వాధీనం..

Share

  • ఒడిస్సా కు చెందిన నిందితుడి అరెస్ట్
  • పట్టుకున్న గంజాయి విలువ రూ.11 లక్షలుగా ఉంటుందని అంచనా

హైదరాబాద్, మహా: నాలుగు బ్యాగుల్లో గంజాయితో ఒరిస్సా నుంచి హైదరాబాద్ కు వచ్చే వోల్వో బస్సులో హైదరాబాద్ కు వస్తున్న ఒడిస్సా కు చెందిన నాభి నాయక్ అలియాస్ హరి కి సంబంధించిన 20.600 కేజీల గంజాయిని రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ టీం పట్టుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. గతంలో భారీగా గంజాయి స్మగ్లింగ్ చేస్తూ హైదరాబాద్ రాయదుర్గం ప్రాంతంలో ఎస్ఓటి పోలీసులకు పట్టుబడిన నాభిన్ నాయక్ అలియాస్ హరి ఒరిస్సా నుంచి నాలుగు బస్తాల్లో 20 కేజీలకు పైగా గంజాయిని తీసుకువస్తూ ఉన్నాడనే సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ రంగారెడ్డి జిల్లాకు చెందిన ఏఈఎస్ జీవన్ కిరణ్ సిఐలు సుభాష్ చందర్ ఇతర సిబ్బందిని కలిసి రామోజీ ఫిలిం సిటీ వద్ద బస్సును నిలిపి తనిఖీలు నిర్వహించి అందులో ఉన్నటువంటి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.11 laksమేర ఉంటుందని అంచనా వేశారు. గంజాయిని పట్టుకున్న టీంలో ఏఈ ఎస్ జీవన్ కిరణ్ సిఐలు సుభాష్ చందర్ బాలరాజు ఎస్ఐలు వెంకట్ రవి అఖిల్ తో పాటు సిబ్బంది ఉన్నారు.

 

పట్టుకున్న గంజాయిని నిందితుడిని హయత్ నగర్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. గంజాయిని పట్టుకున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ టీంను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాస్ ఖాసీం, డిప్యూటీ కమిషనర్ పి దశరథ్ అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్లు అభినందించారు.