- భారత్‌తో యుద్ధం జరిగే అవకాశం
- ఈసారి యుద్ధం జరిగితే.. గతంలో కన్నా మెరుగైన ఫలితాలు సాధిస్తాం
- పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రగల్బాలు
ఇంటర్నెట్ డెస్క్, మహా: పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆపరేషన్ సిందూర్‌తో భారత్ దెబ్బను రుచి చూసినా.. పాకిస్థాన్ ప్రగల్బాలు మాత్రం ఆపట్లేదు. తాజాగా ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. భారత్‌తో మళ్లీ యుద్ధం జరిగే అవకాశాలను తోసిపుచ్చలేమన్నాడు. అయితే, ఈసారి యుద్ధం వస్తే తాము అనుకూల ఫలితాలు సాధిస్తామంటూ బీరాలు పలికారు. పాక్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను ఉద్రిక్తతలను కోరుకోవట్లేదు. కానీ, ముప్పు పొంచి ఉన్నమాట వాస్తవం. భారత్‌తో యుద్ధం అవకాశాలను కొట్టిపారేయలేం. కానీ, ఈసారి యుద్ధం జరిగితే.. గతంలో కన్నా మెరుగైన ఫలితాలు సాధిస్తాం’’ అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాక్‌కు ఇటీవల భారత్ ఆర్మీ చీఫ్ గట్టి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దానికి బదులిస్తూనే ఖవాజా ఈ విధంగా కవ్వింపులకు పాల్పడ్డాడు.







