Mahaa Daily Exclusive

  బాలికల అభ్యున్నతి విద్య ద్వారానే సాధ్యం :జె.సి రాజు.

Share

విజయనగరం జిల్లా,మహా పత్రిక:
బాలికల భవిష్యత్ వారి అభ్యున్నతి విద్యాద్వారానే సాధ్యమని,బాలికలు విద్యావకాశాలు అందిపుచ్చుకునేల వారిని ప్రోత్సహించాలని కారుణ్య ఫౌండేషన్ చైర్మన్ జె సి రాజు పిలుపునిచ్చారు.అంతర్జాతీయ బాలికల దినోత్సవ నేపథ్యంలో శనివారం ఇందిరమ్మ కాలనీ లో నివాసముంటున్న సంచార జాతుల కుటుంబాలకు చెందిన బాలికలకు,వారి తల్లితండ్రులకు బాలికల చదువు.భవిష్యత్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ముందుగా బాలిక దినోత్సవ గోడ పత్రికలను ప్రదర్శించారు.చదువుకోవడం పిల్లల హక్కని వారిని చదివించటం తల్లిదండ్రుల బాధ్యతని అన్నారు. స్వాతంత్య్రం పొందుకొని ఏళ్ళు గడుస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో బాలికలకు చదువు అందటం లేదన్నారు.బాలికలు విద్యావంతులు కాలేక పోతే సమాజం అభివృద్ధి చెందదని అన్నారు. అలాగే సమాజం బాలిక ల హక్కులను పరిరక్షించాలన్నారు,వా
రిపై లైంగిక వేధింపులు ఆపాలన్నారు.ఆడబిడ్డను పుట్టనిద్దాం, బ్రతకనిద్దాం చదువునిద్దాం అని పిలుపునిచ్చారు. వీరితో పాటు సమాజ సేవకులు జగదీష్,తల్లులు,బాలికలు పాల్గొన్నారు.

Latest